వైరల్ అవుతున్న లోకేశ్-బ్రహ్మణి ఫొటో.. స్వయంగా పోస్టు చేసిన మంత్రి లోకేశ్!

  • 11 ఏళ్ల క్రితం బ్రహ్మణితో వివాహం
  • భగవంతుడు తనకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అన్న మంత్రి
  • సినీ, రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు
బ్రహ్మణితో తన వివాహం జరిగి 11 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్న ఓ ఫొటో వైరల్ అయింది. గత 11 ఏళ్లుగా ప్రేమ, ఆప్యాయతలు నిరంతరాయంగా అందుతున్నాయని పేర్కొన్నారు. భగవంతుడు తనకు ఇచ్చిన గొప్ప వరం బ్రహ్మణి అని లోకేశ్ తెలిపారు. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. హ్యాపీ యానివర్సరీ అంటూ బ్రహ్మణికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, లోకేశ్-బ్రహ్మణి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. 
Go Back to Shorts
Nara Lokesh
Brahmani
Marriage
anniversary
Andhra Pradesh
Minister

More Telugu News